'హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సూపర్ హిట్ చిత్రాల యువ హీరో వరుణ్ సందేశ్, ప్రముఖ హీరోయిన్ కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా అరిమిల్లి రామకృష్ణ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేసనపల్లి రాదామోహన్ నిర్మిస్తున్న విభిన్న కధా చిత్రానికి 'ఏమైంది ఈవేళ' అని పేరుపెట్టారు.
ఈచిత్రం గురుంచి నిర్మాత కేసనపల్లి రాదామోహన్ మాట్లాడుతూ 'మా చిత్రానికి ఎన్నో టైటిల్స్ అనుకున్నాం. నాలుగైదు టైటిల్స్ పరిశీలించి వీటిలో ఏ టైటిల్ బెస్ట్ అవుతుందని అన్ని సర్కిల్స్ తో డిస్కస్ చేసి మెజారిటీ ఒపీనియన్ ని బట్టి 'ఏమైంది ఈవేళ'ని ఫిక్స్ చేసాం. 'ఏమైంది ఈవేళ' కధలో చాలా నావెల్టి వుంది. వరుణ్ సందేశ్ కి ఇది మరో సూపర్ హిట్ సినిమా వుతుంది. పాటలు మినహా షూటింగ్ పూర్తయింది' అన్నారు.
వరుణ్ సందేశ్, శశాంక్, నిషా అగర్వాల్, నిషా షా, 'వెన్నెల' కిషోర్, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, ఝాన్సి, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఫోటోగ్రఫీ: బుజ్జి, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎడిటింగ్: ముత్యాల నాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: ఎమ్.ఎస్.కుమార్, సమర్పణ: అరిమిల్లి రామకృష్ణ, నిర్మాత: కేసనపల్లి రాదా మోహన్, కదా, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
Monday, September 6, 2010
వరుణ్ సందేష్, నిషా అగర్వాల్ ల 'ఏమైంది ఈవేళ'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment